Thursday, July 25, 2019

stothram chellinthumu

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి       

దివారాత్రములు కంటిపాపవలె కాచి
దయగల హస్త్తముతో బ్రోచి నడిపించితివి     

గాడాందకారములో కన్నీటి లోయలలో
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి     

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్దినొంద శుద్దాత్మను నొసగితివి     

సీయోను మార్గములో పలుశోధనలు రాగా
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి   

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి     

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా