Thursday, November 4, 2021

Krupaamayudaa

 కృపామయుడా – నీలోనా (2)

నివసింప జేసినందున

ఇదిగో నా స్తుతుల సింహాసనం

నీలో నివసింప జేసినందునా

ఇదిగో నా స్తుతుల సింహాసనం

కృపామయుడా…


ఏ అపాయము నా గుడారము

సమీపించనీయక (2)

నా మార్గములన్నిటిలో

నీవే ఆశ్రయమైనందున (2)         ||కృపామయుడా||


చీకటి నుండి వెలుగులోనికి

నన్ను పిలచిన తేజోమయా (2)

రాజవంశములో

యాజకత్వము చేసెదను (2)       ||కృపామయుడా||


నీలో నిలిచి ఆత్మ ఫలము

ఫలియించుట కొరకు (2)

నా పైన నిండుగా

ఆత్మ వర్షము కుమ్మరించు (2)      ||కృపామయుడా||


ఏ యోగ్యత లేని నాకు

జీవ కిరీటమిచ్చుటకు (2)

నీ కృప నను వీడక

శాశ్వత కృపగా మారెను (2)      ||కృపామయుడా||

Anandam Neelone

                ఆనందం నీలోనే – ఆధారం నీవేగా

                ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా 

                అర్హతే లేని నన్ను ప్రేమించినావు         

                జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై                                                " ఆనందం నీలోనే " 


                పదే పదే నిన్నే చేరగా ఈ ప్రతి క్షణం నీవే ధ్యాసగా 

                కలవరాల కోటలో కన్నీటి బాటలో 

                కాపాడే కవచముగా నన్ను ఆవరించిన 

                దివ్య క్షేత్రమ స్తోత్రగీతమ                                                                    " ఆనందం నీలోనే "


                నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీవని 

                నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా

                నీ కొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించన 

                సత్య వాక్యమే జీవ వాక్యమే                                                                  " ఆనందం నీలోనే "


                సర్వసత్యమే నా మార్గమై సంఘ క్షేమమే నా ప్రాణమై 

                లోకమహిమ చూడక నీ జాడలు వీడక 

                నీతోనే నిలవాలి నిత్య సీయోనులో... 

                ఈ దర్శనం నా ఆశయం..                                                                    " ఆనందం నీలోనే "

Nijamaina Draakshaavalli

 

నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – (2)         ||నిజమైన||

అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2)         ||నిజమైన||

నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2)         ||నిజమైన||

షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)         ||నిజమైన||