Monday, June 8, 2020

Najareyuda Na Yesayya Yenni Yugalakaina

నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా
 ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద } 2

1.ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి } 2
శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా } 2
నీకే వందనం - నీకే వందనం } 2                          || నజరేయుడా ||  


2.ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి } 2
జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా } 2
నీకే వందనం - నీకే వందనం } 2                         || నజరేయుడా ||  


3.సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా } 2
సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా } 2
నీకే వందనం - నీకే వందనం } 2                         || నజరేయుడా || 

No comments:

Post a Comment